సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ప్రచారాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానించడం తగదన్నారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని ఆరోపించిన మంత్రి, జగన్ పాలనలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *