ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 78 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక వినతులను జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అందిన ఫిర్యాదులకు సంబంధించి ఫిర్యాదుదారుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, తక్షణమే విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించేలా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, నిర్ణీత గడువులో వాటిని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా స్పందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర ప్రత్యేక అవసరాలు ఉన్న ఫిర్యాదుదారుల పట్ల సున్నితంగా వ్యవహరించి, వారి వినతులను ప్రాధాన్యతతో పరిశీలించి, చట్టపరమైన పరిధిలో త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు, మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
