google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మలేరియా వ్యాధిలేని సమాజం కోసం అందరం పునరంకితం కావాలని కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డెపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాII బ్యూలా గ్రేస్ అన్నారు. సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఉద్భోధించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటిస్తామని, వారానికి ఒకరోజు డ్రై డే అమలు చేస్తామని, జ్వరం వచ్చిన వేంటనే తగిన రక్త పరీక్షలు చేయించుకుంటామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు ఇన్ ఛార్జ్ amo జీవివి ప్రసాద రావు, dpmo వెంకటేశ్వర్లు, cho శ్రీనివాసులు, phn పద్మావతి, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed