రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ లింగమనేని రమేష్ గారిని ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ షేక్ రియాజ్ గారు ఆదివారం ఉదయం విజయవాడలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా ఆయనకు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. అనంతరం షేక్ రియాజ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుల్లో లింగమనేని రమేష్ గారు ఒకరని పేర్కొన్నారు. గెలుపు–ఓటములతో సంబంధం లేకుండా గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెన్నంటి నిలుస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.రాజ్యసభ అభ్యర్థిగా ఆయన ఎంపిక కావడం పార్టీ శ్రేణులందరికీ ఆనందదాయక విషయమని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *