google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకూరు గ్రామ సమీపంలోని NH-167B జాతీయ రహదారిపై డ్రమ్స్ మరియు స్టాపర్లను ఏర్పాటు చేశారు.అతివేగాన్ని నియంత్రించడం, ప్రమాదకర మలుపులు మరియు కూడళ్ల వద్ద ప్రమాదాలను తగ్గించడం, స్థానిక ప్రజలు మరియు వాహనదారుల సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, వేగ పరిమితులను గౌరవించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు.ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ ప్రమాద రహిత రహదారుల కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *