బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నాను.సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అర్జీలను ప్రజలు అందజేశారు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అన్ని సమస్యలను దశలవారీగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.గ్రీవెన్స్ అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న SIR కార్యక్రమం పురోగతిపై నాయకులతో సమీక్ష నిర్వహించాను. ఇప్పటికే ఎనుమరేషన్‌లో విశేష పురోగతి సాధించినప్పటికీ, మిగిలిన డిజిటలైజేషన్, మ్యాపింగ్, లింకేజ్ ప్రక్రియలను కూడా గడువులోపు పూర్తి చేయాలని నాయకులకు సూచించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *