తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 5 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.58,680 నగదుతో పాటు 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జిల్లాలో జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు మరియు ఇతర నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *