google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 5 మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.8,460 నగదుతో పాటు 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
జిల్లాలో జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed