తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశం… ఇంచార్జి మంత్రివర్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన బుధవారం ఒంగోలులోని ప్రకాశం భవన్ లో జరిగింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు. రెవిన్యూ శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ రాజాబాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు. సగం పంచాయతీలకు రెగ్యులర్ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు లేరన్నారు. అలాగే 5 మండలాలకు గాను రెండు మండలాల్లో మాత్రమే RWS ఏఈ లు పనిచేస్తున్నారని చెప్పారు. సిబ్బంది కొరత వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని వివరించారు. అలాగే కందుకూరు లోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పెరుగుతున్న రోగుల సంఖ్య దృష్టిలో ఉంచుకొని వెంటనే ఖాళీలు భర్తీ చేసి సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు విజ్ఞప్తి చేశారు. ఇంకా పలు సమస్యలపై సమావేశంలో ఆయన మాట్లాడారు.