ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణ చర్యల్లో భాగంగా డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, పార్కులు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహిళల భద్రతకు భంగం కలిగించే సంఘటనలు, ఈవ్ టీజింగ్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *