తొలి శుభోదయం న్యూస్ ప్రకాశంపోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వై.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలంక శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడింది.ఈ సందర్భంగా వై.పాలెం ఎస్ఐ గారు మరియు పోలీసు సిబ్బంది ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించి ఆలయ పరిసరాలు, రద్దీ ప్రాంతాలు మరియు భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.భక్తులు పోలీసులకు సహకరించి, క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.