సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బోర్డు చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు.సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 100 నోట్ పుస్తకాలు, విద్యాసామాగ్రి మరియు స్వీట్లు పంపిణీ చేసి విద్యార్థుల పట్ల తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానోపాధ్యాయులు నరసింహారావు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించాలని, విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు సన్నెబోయిన శ్రీనివాసులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థుల కోసం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.ఈ కార్యక్రమానికి శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు కుమారుడు శ్రీ కార్తీక్ ఆర్థిక సహకారం అందించగా, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.అదేవిధంగా విద్యార్థులు నోట్ పుస్తకాలు, స్వీట్లు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో అనుసంధానం చేయడం ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *