తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి మార్కెట్ యార్డ్‌లో అలిమ్కో సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు గారితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు మొత్తం 309 సహాయక పరికరాలు అందజేశారు.
♿ బ్యాటరీ సైకిళ్లు – 143
♿ ట్రై సైకిళ్లు – 59
♿ వీల్‌చైర్లు – 30
♿ వినికిడి యంత్రాలు – 40
♿ చేతికర్రలు – 37
దివ్యాంగుల స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవప్రదమైన జీవనానికి ఈ పరికరాలు తోడ్పడతాయని తెలిపారు.“కూటమి ప్రభుత్వం… తెలుగుదేశం పార్టీ… మీ గొట్టిపాటి లక్ష్మీ… దివ్యాంగులకు ఎప్పుడూ అండగా ఉంటాయి” అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో తొలి విడతగా కనిగిరి వరకు ఆగస్టులో డెమో రైలు నడపనున్నట్లు శుభవార్త తెలిపారు. ఇది దర్శి ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయి అని పేర్కొన్నారు.దివ్యాంగులలోని ప్రతిభ, శక్తిని వెలికితీసి సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు గారు అన్నారు.