మహిళలు, బాలికలు భయాందోళనలు లేకుండా విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో స్వేచ్ఛగా సంచరించేలా ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు ఈవ్ టీజింగ్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, పార్కులు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో డ్రోన్ నిఘాతో పాటు ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల కదలికలను నిశితంగా గమనిస్తూ, మహిళలను వేధించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ప్రత్యేక నిఘా చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *