తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని ఆచార్య రంగ భవన్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, వైద్య సలహాలను ఉచితంగా అందించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. పశుపోషకులు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు కార్యక్రమంలో ఆచార్య రంగ భవన్ ప్రతినిధులు, పశువైద్య సిబ్బంది, స్థానిక పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు.