ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాలు మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *