ప్రకాశం జిల్లా దర్శి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, చట్టాల సమర్థవంతమైన అమలుపై జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ సోమవారం అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.పోలీస్ స్టేషన్ల వారీగా గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జీషీటు దాఖలు మరియు పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. నేర నియంత్రణ, నేరాల ఛేదించుట, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు శాంతి భద్రతలకు పరిరక్షణకు అధికారులకు పలు కీలక సూచనలు మరియు మెళకువలను తెలియజేసారు.ఈ సమావేశంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి ఒక్క పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులలో సమగ్ర దర్యాప్తు చేసి, మహిళా సంబంధిత నేరాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయం లోపల బాధితులకు న్యాయం అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాపర్టీ నేరాల్లో నిందితులను పట్టుకోడానికి మరియు దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయుటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెయ్యాలని, పాత నేరస్థులపై మరియు చెడునడతగల వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్లను వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకట్ట వేసే విధంగా డ్రోన్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు మలుపుల వద్ద కుంభాకార దర్పణాలు (Convex Mirrors) ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపైకి ప్రవేశించే ముందు వాహనదారులు తప్పనిసరిగా వాహనాన్ని ఆపి ఇరువైపులా చూసుకొని వెళ్లన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు.గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలనీ, బైండవర్ ఉల్లఘించిన వారిపై తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, చట్టాలు, శిక్షలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ గారు మొక్కను నాటి పరిశుద్ధంగా మరియు ఆహ్లాదకరంగా ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, అద్దంకి టౌన్ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, సంతమాగులూరు సిఐ శేషగిరిరావు, దర్శి సిఐ రామారావు, దర్శి సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *