ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పామూరు ఎస్‌ఐ గారు కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, బాలికల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాల నివారణ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదని సూచించారు. ఏదైనా అనుమానాస్పద లేదా అసౌకర్యకర పరిస్థితి ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్‌ఐ గారు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *