తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్, దొర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న/మిస్సింగ్ మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుర్తించి రికవరీ చేశారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను వాటి అసలు యజమానులకు పోలీస్ అధికారులు అప్పగించారు. మొబైల్ ఫోన్లను తిరిగి అందించినందుకు బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.