ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో మహిళలు, బాలల భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం శక్తి యాప్ వినియోగం, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.అలాగే నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నేరాల నివారణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *