తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ను కలిసి స్థానిక వైసీపీ కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఆప్యాయతలను చాటుకున్నారు.పార్టీ కార్యక్రమాల్లో,ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కొత్తగొర్ల వసంత, కందుకూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు తుల్లూరి ఆదిలక్ష్మి,గుడ్లూరు మండలం మహిళా ఉపాధ్యక్షురాలు నాగిశెట్టి మల్లిక, ఉలవపాడు మండలం మహిళ ఉపాధ్యక్షురాలు జంపని అనురాధ, మహిళానేతలు తాటిపర్తి సుధారాణి, బొల్లా. వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హారతి పట్టి బుర్రా.మధుసూదన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బుర్రా మహిళా నేతలను ఆశీర్వదించి అన్నాచెల్లెల అనుబంధానికి ఆప్యాయతకు ప్రతికైన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.