సంతనూతలపాడు నియోజకవర్గం,నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు నా సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నాను.రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్‌ను నిర్మించనున్నారు.ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి 5-స్టార్ హోటల్‌గా ఇది నిలవనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రాంతంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మరింత ఊతం లభించడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *