తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావుకు (ఆదివారం)న సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మాజీ శాసనసభ్యులు,కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేయండం జరిగింది. మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నికైనందున కందుకూరు నియోజకవర్గం పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. అందువలన రేపు ఉదయం 10:30 గంటలకు అభినందన సభ ను వైయస్సార్సీపి కార్యాలయం లో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , అనుబంధ విభాగాల నాయకులు, వివిధ పదవిలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి, మండల పట్టణ గ్రామస్థాయి నాయకులు అందరూ హాజరు కావలసినదిగా ఈ ప్రకటనలో ఆయన కోరారు.