టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె.అనూష ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కె.అనూష మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఓటర్లుగా నమోదు కావాలని తెలియజేశారు. అర్హత కలిగిన వారు అందరూ కూడా వెంటనే తమ తమ బిఎల్ఓ లను కలిసి ఓటర్లుగా నమోదయి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని తెలియజేశారు. అదేవిధంగా అందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, అలా అందరూ ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం యొక్క నిజమైన విలువ పెరుగుతుందని, మెరుగైన పాలకులను ఎన్నుకోవచ్చని ఆమె విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ తమ కళాశాలలో అర్హులైనవిద్యార్థిని విద్యార్థులు అందరిని ఓటర్లుగా నమోదు చేస్తామని తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా ఓటు యొక్క విలువ తెలుసుకొని మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆఫీస్ ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీ పి చంద్రయ్య, బి ఎల్ వో లు శివన్నారాయణ, హంజా తో పాటు కళాశాల ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె వి పద్మావతి మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *