బహిరంగ మద్యం, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గార్ల ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అనుమానాస్పద ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, జూదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహిస్తూ పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.డ్రోన్ కెమెరాల ద్వారా విస్తృత ప్రాంతాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, గుంపులు మరియు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నారు. టెక్నాలజీని వినియోగించడం ద్వారా పోలీసుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చి, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం లేదా నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.విజిబుల్ పోలీసింగ్ + డ్రోన్ సర్వైలెన్స్ + నిరంతర నిఘా ద్వారా జిల్లాల్లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోంది.అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, నేరరహిత మరియు ప్రశాంత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.