ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో జిల్లాలోని వివిధ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేసి, రాకపోకలను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, అనుమతి లేని గుంపులు, వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *