45వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి సయ్యద్ హుస్సేన్ ను సుత్తి ,కొడవలి, నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి..
45వ డివిజన్ గాంధీనగర్, బిఆర్ హోమ్స్ సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి సయ్యద్ హుస్సేన్ ఇంటింటి ప్రచార క్యాంపెయిన్.ఈ సందర్భంగా సిపిఎం నగర నాయకులు టి.మహేష్ మాట్లాడుతూ 45 డివిజన్ సమగ్ర అభివృద్ధి చేయాలంటే ,ప్రజా సమస్యలపై పనిచేసే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, అవినీతి, అక్రమాలకు తావులేని ప్రజాపాలన కోసం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని తెలియజేశారు .45 డివిజన్లో ఎన్నికల ప్రణాళిక తాగునీరు డివిజన్లో అన్ని ప్రాంతాలు మంచినీరు పూర్తిస్థాయిలో సప్లై విధంగా చర్యలు చేపడతామని, డ్రైనేజీ వ్యవస్థను మురుగునీరు సక్రమంగా బయటకు పోయేటట్లు మెరుగుపరచుతామని పారిశుధ్యం కార్మికులు సంఖ్య పెంచి ,పారిశుధ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని, మంగమూరు రోడ్డు జంక్షన్ నుండి ఆశ్రమం వరకు డివైడర్ ,లైటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రతి ఇంటికి నీరు, ప్రతి కాలనీకి రోడ్డు ప్రతి కుటుంబానికి నివాసం ,ప్రతి యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి సిపిఎం పార్టీ కృషి చేస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు బి వి రావు , 45వ డివిజన్ నాయకులు టీ దాసు ,ఎస్.కె జాన్ బాషా ,ఆర్ శ్రీను వాసులు, కె గురవయ్య, బండి వీరాస్వామి, రామకృష్ణ , యం.అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *