తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్ర‌మంలో టాస్క్ ఫోర్స్ సీఐ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సై శివరామయ్య, చెంచయ్య, ఏఎస్ఐ మహబూబ్బాషా మరియు సిబ్బంది కలసి ఒంగోలు తాలూకాపోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాయపాలెం గ్రామం,సముద్రం కాలువ ప్రాంతంలో కోడిపందెం స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి కోడిపందాలు నిర్వహిస్తున్న 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి , 10 సెల్ ఫోన్లు , 2 కోళ్ళు మరియు రూ.43750/- నగదు స్వాధీనం చేసుకున్నారు. జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.

By JALAIAH

One thought on “అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *