google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

దేశవ్యాప్తంగా జనగణన గురువారం ప్రారంభమైన నేపథ్యంలో…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, తన కుటుంబ వివరాలను సొంతగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలిరోజున ప్రజా ప్రతినిధులతో వివరాలు చేస్తుండగా…. స్థానిక ఎమ్మెల్యేతో, జిల్లా రెవిన్యూ అధికారి ఓబులేసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు స్వీయ గణన జరుగుతుందని, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు తీసుకుంటారని డిఆర్ఓ తెలియజేశారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, 2027 సెన్సస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు, వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు. అప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో తహసిల్దార్ కళ్యాణ్, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పలువురు నేతలు హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *