పార్టీకార్యాలయం, అన్న క్యాంటీన్ లో కేక్ కటింగ్
ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా, కందుకూరులో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, బాబుగారి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం ఏర్పడింది. స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. భారీ కేక్ కట్ చేసి, నేతలకు తినిపించారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తరతరాలు గుర్తుంచుకునే గొప్పనేత చంద్రబాబు – MLA నాగేశ్వరరావు గారు
తెలుగునేల చిరస్థాయిగా గుర్తుంచుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అమరావతి భవిష్యత్తుకు రూపకల్పన చేస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయిన సందర్భంలో, బాబు గారు ప్రజల కోసం పడిన కష్టం మరువలేమన్నారు. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో 33 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేస్తే, జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి అమరావతి నాశనానికి కుట్ర పన్నారని విమర్శించారు. సీనియర్ రాజకీయ వేత్తగా, భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయగలిగే దార్శనికుడిగా చంద్రబాబు గారి అనుభవం… జగన్ లాంటి రాక్షసుల నుంచి మనల్ని కాపాడుతోందన్నారు.
జగన్ హయాంలో పారిపోయిన కంపెనీలు, పెట్టుబడులు, తిరిగి చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రానికి వస్తున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. అమరావతి, పోలవరం, ఐటీ కంపెనీలు, పోర్టులు.. ఇలా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చంద్రబాబునాయుడు కే సాధ్యమన్నారు. గత ఏడాది ఆయన కందుకూరు వచ్చినప్పుడు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 50 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించారు. కందుకూరు పట్టణ రూపురేఖలు మారడానికి ఆయనే కారణమన్నారు. చంద్రబాబు సారధ్యంలో, రాష్ట్రం మరింత బలమైన ఆర్థిక, పారిశ్రామిక శక్తిగా తయారు కాబోతోందని అన్నారు.
చలివేంద్రం ప్రారంభం
పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. వేసవిలో ప్రజలు, ప్రయాణికుల కోసం మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అన్నక్యాంటీన్ వద్ద పేదలతో మమేకమై…
చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ నేతలతో కలిసి అన్న క్యాంటీన్ వద్ద భారీ కేక్ ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు కట్ చేశారు. అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు 76,000 /- విరాళం అందించారు. అలాగే పిడికిటి వెంకటేశ్వర్లు 27 వేలు, ఉప్పుటూరి శ్రీనివాసరావు 25 వేలు, అల్లం వెంకటేశ్వర్లు 7,600 రూపాయలు విరాళం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా పేదలందరికీ భోజనం వడ్డించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆహారం ఎలా ఉంటుంది… అని వివరాలు అడుగుతూ వారిని పలకరించారు. అక్కడే నేతలతో కలిసి భోజనం చేశారు. చంద్రబాబు పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా అన్నదానం చేసేందుకు శ్రీమతి భువనేశ్వరి గారు, అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు 76 లక్షలు అందించిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేశారు.
ఆసుపత్రిలో పండ్లు పంపిణీ
తర్వాత కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలిగేలా ఆయనకు ఆశీర్వచనాలు అందించాలని ఈ సందర్భంగా నేతలు రోగులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, పూరిమిట్ల గురునాథం, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీనరసింహం, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, సీనియర్ నాయకులు కండ్రా మాల్యాద్రి, పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, నాదెళ్ల వెంకటరమణయ్య, చిలకపాటి మధు, షేక్ రఫీ, షేక్ సలాం, షేక్ రూబీ, చదలవాడ కొండయ్య, వడ్డేళ్ల రవిచంద్ర, కూనం నరేంద్ర, మోదడుగు వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వర్లు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, ముచ్చు శ్రీను, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, షేక్ మున్నా, ముచ్చు రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
