అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్ ఫెలోషిప్ డిమాండ్.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అఖిలపక్ష పార్టీలు మరియు కందుకూరు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగుల ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమీక్ష చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం పుల్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్ళాలని డిమాండ్ చేస్తూ కందుకూరు మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ షెడ్యూల్ కులాల ప్రజలు క్రిస్టియన్ మతం లోనికి మారితే భారత రాజ్యాంగం వారికి కల్పించిన రక్షణ చట్టాలు కోల్పోతారని తీర్పు వెలువరించియున్నది. ఇది భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తి కి భిన్నమైనదిగా భావిస్తూ దళితులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ప్రజలు క్రైస్తవ్యం తీసుకోవడం వలన సమాజములో వారు కులపరంగా ఎదుర్కొను వివక్షత, అంటరానితనం, అవమానాలు ఏమి రూపు మారటం లేదని అందుకే షెడ్యూల్ కులాల ప్రజలకు క్రైస్తవంలో మారినప్పటికీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 15 లో కల్పించిన విధంగా రక్షణ చట్టాలను అమలు చేయాలని అదేవిధంగా భారత పౌరులు వారికి నచ్చిన విధంగా ఆర్టికల్ 25 ప్రతిపాదించిన మత స్వేచ్ఛను గౌరవించాలని కోరుతున్నాము అని అన్నారు. ఈ విషయమును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అప్పీల్ కి వెళ్లి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల పట్ల వారి హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకొవాలని కోరారు. మండల తహసీల్దార్ స్పందించి ప్రభుత్వానికి మెయిల్ ద్వారా మీ వినతిని తప్పక తెలియజేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రేమల జనార్ధన్,నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ జాతీయ సలహాదారులు ముప్పవరపు కిషోర్, సామాజిక వేత్త గేరా.చిరంజీవి, కందుకూరు టౌన్ పాస్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుడుముల సామేలు, సెక్రటరీ వర్ల మహేంద్రబాబు, వైయస్సార్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు ఉచ్చులూరి రవీంద్ర, టౌన్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జంగిలి ఇశ్రాయేలు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొండేటి కరుణాకర్ , గడ్డం జాన్(JDBM) టౌన్ చర్చ్,జాయింట్ సెక్రెటరీ బి రమేష్,జాయింట్ సెక్రెటరీ,పి పరిశుద్ధం,ట్రెజరీ కుడుముల మహేష్ సంఘ కాపరులుD. రత్నం,వర్ల ఇసాక్,R.సాల్మన్M.అనిల్ కుమార్,P. ప్రసన్న పాల్ వర్ల మాలకొండయ్య,రాజేష్,తిమోతి,పెరికే ఇస్సాక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.