google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

బాపట్ల పట్టణం టీచర్స్ కాలనీ హైవే రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిబివి రంగారావు వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయటం జరిగింది. మోటార్‌ వాహన చట్టంపై అవగాహన కల్పించి వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ పత్రాలు ఉండాలని పేర్కొన్నారు. రహదారి భద్రత నియమనిబంధనలు విధిగా పాటించాలని, వాహనాలను కండిషన్‌లో నడపాలని, అన్నారు. ఆటోల్లో సంఖ్యకు మించి ఎక్కించరాదని, సరుకు రవాణా వాహనాల్లో మనుషులను ఎక్కించరాదని, అధిక బరువు వేయరాదని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు .

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *