జిల్లా ప్రజల నుంచి వచ్చే పలు రకాల ఫిర్యాదులను పరిష్కారించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీస్ అధికారులకు తెలియచేసినారు. జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యల వివరాలను తెలుసుకొని,వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అందిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై తక్షణ విచారణ చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం కల్పించాలని ఆదేశించారు. “మీకోసం” కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి అలసత్వం చూపకుండా, నిర్ణీత గడువులోనే పరిష్కారం అందించాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, కొండేపి సీఐ రమణయ్య, దర్శి సీఐ రామారావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *