తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పెద్దరావీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంభంపాడు గ్రామం పంట పొలాల్లో జూదం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో జూదంలో పాల్గొంటున్న 4 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.