వలేటివారిపాలెం మండలం, కొండసముద్రం గ్రామంలో 458 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.గత ప్రభుత్వ హయాంలో అనుభవం లేని వ్యక్తులతో చేపట్టిన రీ-సర్వే వల్ల కలిగిన అనేక ఇబ్బందులను అధిగమిస్తూ, రైతన్నలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆనాడు జరిగిన తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన విధానంలో నేడు కొత్త పాసుపుస్తకాలు అందజేస్తున్నాము.అన్నదాతను కష్టకాలంలో ఆదుకోవడమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు నేడు రైతన్నల ముంగిట చేరుతున్నాయి. రైతు సంక్షేమమే ఊపిరిగా పని చేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు కట్టుబడి ఉన్నాం.అనంతరం ‘ప్రజాదర్బార్’ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *