దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా మీ అభిమానం చూస్తుంటే నేను ఓడిపోలేదు నేను గెలిచాను మీ హృదయాలలో గెలిచాను అని ఆనందపడుతున్నాను. నేను దర్శిలో గెలుస్తాను మిమ్మల్ని గెలిపిస్తాను మీకు అభివృద్ధి ఏమిటో చూపిస్తాను. ఇప్పటికే చూశారు రెండేళ్ల కూటమిపాలనలో దర్శి ప్రజలతో నా ప్రయాణం అభివృద్ధి ఎజెండాగా కులమతాలకతీతంగా ముందుకు సాగుతున్నాను. ఊరురా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో పడుతున్న కష్టం చూస్తున్నాం. అదే స్ఫూర్తితో నేను మీకు సేవకురాలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకు చేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఒకటవ తేదీ ఇంటింటికి వెళుతున్నాం పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అందించే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, తాగు సాగునీటి వసతి, దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యం తో మనం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాము. మీరు చూస్తున్నారు రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి తప్ప అరాచకం విధ్వంసం లేకుండా ప్రశాంతమైన దర్శిని మనం చూడగలుగుతున్నాం. నేను వారంలో ఐదు రోజులు మీతో ఉంటున్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను ప్రజాసేవ చేస్తున్నాను దర్శి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉంటాను ప్రజలతో తిరుగుతాను ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను లేదంటే సచివాలయానికి వెళతాను మంత్రులను, అధికారులను కలుస్తాను. ఏ పథకం ద్వారా మనకు మేలు జరుగుతుందని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి సాధిస్తాను. అలా దర్శి నియోజకవర్గంలో అనేక ప్రాజెక్టులను మనం ముందుకు తీసుకు వెళ్ళగలిగాం. మన కూటమి పాలనలో 10 కోట్లతో మొగిలిగుండం ప్రాజెక్టును తాళ్లూరు ప్రాంతానికి అందజేయగలిగాం. అదేవిధంగా శాశ్వత తాగునీటి అవసరాలు తెచ్చే అమృత పథకం త్వరలో దర్శిలో ప్రారంభం కాబోతుంది. ఎలాంటి లో వోల్టేజీ సమస్యలు లేకుండా తాళ్లూరులో, ఉల్లగల్లులో, కురిచేడులో దాదాపు 20 కోట్లతో సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు సోలార్ ప్రాజెక్టులను తీసుకువచ్చాము. దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు దాదాపు 5 కోట్లు ఖర్చు చేశాం. గ్రామీణ రోడ్లకు దాదాపు 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఐదు కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లను నిర్మించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు దర్శి పర్యటనలో ఇచ్చిన హామీలను ముందుకు తీసుకు వెళ్ళాం. తూర్పు వీరాయపాలెం లో పట్టాల పంపిణీ, రోడ్ల అభివృద్ధికి కృషి చేశాం. దర్శిలో మినీ స్టేడియం నిర్మాణం ఒక వరంగా చెప్పవచ్చు. టిటిడి కళ్యాణ మండప నిర్మాణం చక చక జరుగుతున్న విషయం మీరు చూస్తున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించుకున్నాం. డిగ్రీ కళాశాల పక్కా భవనాలకు మార్గం సుగమనమైంది. ఆర్టీసీ డిపో నిర్మాణానికి కృషి చేస్తున్నాం. దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. మూడు కోట్లతో ఎన్ఎస్పి లైనింగ్ పనులను చేపట్టబోతున్నాం. దాదాపు నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా ఈ రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు. దాదాపు పది కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఘనత మన అందరిది. నిత్యం మీతో ఉంటున్నాను మీ సమస్యలు తెలుసుకుంటున్నాను. మీ అండగా నిలుస్తున్నాను. దర్శి ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేయాలన్న లక్ష్యంతో వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నిరంతరం నేను ఆలోచన చేస్తున్నాను. యువతకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండేళ్ల కూటమిపాలనలో జరుగుతుంది. మీరు గతంలో ఐదేళ్లు వైసిపి పాలను చూశారు ఏం చేశారు వర్గవైశ్యమ్యాలు, కుల మతాలు, విధ్వంసాలు, ప్రజలపై దాడులు అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మన కూటమిపాలనలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నామని సగర్వంగా చెబుతున్నాను. అభివృద్ధి ఎజెండాగా వెళుతున్నము. మనకూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి, దీవించండి నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా భావించి నా అండగా నిలబడండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేదం కలిసికట్టుగా ముందుకు వెళదాం. గతా అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తప్పిదాన్ని సరి చేసుకుందాం తెలుగుదేశానికి బలమైన దర్శి నియోజకవర్గంలో జెండా ఎగర వేద్దాం తెలుగుదేశం అడ్డా అని నిరూపిద్దాం. ఇక్కడ నాయకులు కార్యకర్తలు బలమైన వారు దర్శి లో పార్టీ చాలా బలంగా ఉంది మనం మనకు మనం బలహీనం చేసుకోవద్దు కలిసికట్టుగా ముందుకు వెళదాం. స్థానిక సంస్థల్లో మన సత్తా చాటుదాం. ఈ సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాను.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, పిడతల నెమిలయ్య, మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మహిళలు, టిడిపి జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరైన టిడిపి, కూటమి శ్రేణులు. కోలాహాలంగా డాక్టర్ లక్ష్మీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *