ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో MSCD పరికరాల సహాయంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించి, డిజిటల్ డేటాబేస్‌తో క్షణాల్లో సరిపోల్చి వారి నేర చరిత్రను గుర్తించే ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు మరియు కీలక కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, పాత నేరస్తులు మరియు అనుమానాస్పద వ్యక్తులను వేగంగా గుర్తించే చర్యలు చేపడుతున్నారు. ఈ ఆధునిక సాంకేతికతతో నేరాల నివారణలో వేగం, దర్యాప్తులో ఖచ్చితత్వం, ప్రజల భద్రతలో మరింత బలోపేతం సాధ్యమవుతోందని పోలీసులు తెలిపారు.‘టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్’ ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *