కార్డన్ & సెర్చ్ లో 85 మోటార్ సైకిల్, రెండు ఆటోలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ పి. బాలమురళికృష్ణ , ఆధ్వర్యంలో మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ST కాలనీ మరియు పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రా ప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు , అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు, సంతమాగులూరు సిఐ శేషగిరీరావు, మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ , జె. పంగులూరు ఎస్సై వినోద్ కుమార్ , సంతమాగులూరు ఎస్ఐ పట్టాభిరామయ్య, మరియు సిబ్బంది 45 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, గంజాయి కేసుల్లోని పాత ముద్దాయిల ఇళ్లు మరియు ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 85 మోటార్ సైకిల్, రెండు ఆటోలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు. దర్శి డిఎస్పీ శ్రీ పి.బాలమురళికృష్ణ గారు మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడిన, ఎవరైనా అసాంఘిక/చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వాహనాలు కొనుకోలు చేసే ముందు అన్ని డాక్యుమెంట్ లు సరిగా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు…..