తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్లో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో 41 బైక్లు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వినియోగం, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.