వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె దగ్గర 100 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న MSME పార్కుకు, CM చంద్రబాబు సోమవారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించగా సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, పలువురు అధికారులు హాజరయ్యారు.తొలి విడతగా 20 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. MLA మాట్లాడుతూ… కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు, బిపిసిఎల్, ఇండోసోల్ కంపెనీలు ఇప్పటికే ఏర్పాటు కాగా, కొత్తగా MSME పార్కు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.వలేటివారిపాలెం చుట్టుపక్కల గ్రామాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని, పరిశ్రమలు వస్తే వారందరికీ ఇక్కడే ఉపాధి దొరుకుతుందని అన్నారు. నియోజవర్గానికి చెందిన వారు ఎవరైనా, ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే, వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అయ్యవారిపల్లె ప్రాంతం పారిశ్రామిక నగరంగా మారడం ఖాయమన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *