తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జన గణన ను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మార్కాపురం జిల్లా అధ్యక్షురాలు జాడి శ్వేత అన్నారు. ఒంగోలు లో కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన అనంతరం మీడియా సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో డెడికేటెడ్ కమిషన్ సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ ను సంతృప్తికరంగా అమలు జరిపేలా రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన ఏం పరికల్ డేటా సేకరించి, వారి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలను బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. ఆ గణాంకాలన్నీ అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చూడాలన్నారు.ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు,మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా,స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తోడ్పడాలన్నారు. అన్ని రకాల రిజర్వేషన్ల పెంపుకు ప్రధాన ఆటంకంగా ఉన్న 50 శాతం సుప్రీం పరిమితిని ఎత్తేపించేలా అన్ని చర్యలు గైకొనేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానాలైన రక్షణ చట్టం,50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ వెంటనే అమలు జరిపించాలని కోరామన్నారు.బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రిమిలేయర్ ఎత్తేయడం,బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ,ఏసీబీ/విజిలెన్స్ కేసుల సత్వర పరిష్కారం సక్రమంగా అమలు జరిగేలా సహకరించాలని తెలియజేశామన్నారు. ప్రతి ఇంట్లో ఒక బీసీ పారిశ్రామికవేత్త ఉండేలా తోడ్పాటునందించేలా ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ఇలా అనాదిగా అన్ని రంగాలలో- అన్ని విధాల వెనుకబడి ఉన్న బీసీల నాదుకునేలా సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ఆర్థికాభివృద్ధికి,అన్ని స్థాయిలలో రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాషాలో కల్పించడం ద్వారా బీసీల సాధికారితకు దోహదపడాలని డెడికేటెడ్ కమిషన్ కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో తెలియజేసినట్లు తెలిపారు.విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన వారిలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.