అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి సీఐ ఆధ్వర్యంలో, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపుగల్లు గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి రూ.22,070 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇటువంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *