తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా…. ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. వేడుకలకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం పరిశీలించారు. పార్టీ పెద్దల సందేశాలు, తీర్మానాలు, ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా అన్నిచోట్లా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. అలాగే కార్యకర్తల సంరక్షణలో భాగంగా….ఎండ వేడిమిని తట్టుకునేలా వేదిక చుట్టూ కూలర్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రతిచోటా మెడికల్ టీంను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే భోజనాలు, ఇతర ఏర్పాట్లు గురించి పార్టీ ముఖ్యలతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు చర్చించారు. అన్ని గ్రామాల నుంచి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చూడాలన్నారు. కందుకూరు పట్టణం, కందుకూరు మండలంలోని పలుకూరు, మోపాడు, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో ఎమ్మెల్యే గారు పర్యటించారు. నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి, పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, క్లస్టర్ ఇన్చార్జిలు చిలకపాటి మధు, వడ్డెళ్ళ రవిచంద్ర, పోలుబోయిన శ్రీను, వాసు, కృష్ణమోహన్, ఉమ్మనేని సుబ్బారావు, చిత్తారు మల్లికార్జున, గొంది నరసింగరావు, బొద్ధులూరి కొండలరావు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *