సింగరాయకొండ బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న కుసుమ హరనాథ ఆలయం సమీపంలో భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వీచిన బలమైన ఈదురు గాలుల కారణంగా చెట్టు బలహీనపడినట్లు స్థానికులు చెబుతున్నారు.చెట్టు రోడ్డుపై పడటంతో పాటు ప్రధాన విద్యుత్ లైన్లపై పడడంతో కరెంట్ తీగలు ,ఇంటర్నెట్ కేబుల్స్ మరియు డిష్ వైర్లు తెగి రోడ్డుమీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటన సమయంలో రోడ్డుపై జనసంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లకుండా హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది మరియు స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపడుతున్నారు..ప్రమాదకర స్థితిలో ఉన్న పాత చెట్లను ముందస్తుగా గుర్తించి తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *