తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
పల్లెనిద్ర’పల్లెనిద్ర’ కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలో బస చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు శనివారం వేకువజామునే గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.పారిశుధ్యం, త్రాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ. పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా తీరును ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.