తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-
మర్రిపూడి మండలం రామాయపాలెం గ్రామం నందు పేదల సేవలో ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య .ఈ సందర్భంగా సత్య గారు ప్రసంగిస్తూ….
“పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అవ్వాతాతల, వికలాంగుల, ఒంటరి మహిళల ముఖాల్లో ఆనందం చూడటమే ఎన్టీఆర్ భరోసా పథకం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అత్యధికంగా పెన్షన్లకు ₹33 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు.