ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రజల్లో ఉనికి కోసమే డీఎస్సీపై గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. సోమవారం సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి డిఎస్ బీవీ స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజల్లో ఉనికి కోసమే డీఎస్సీపై గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు చేస్తోంది. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. మీ రాజకీయ లబ్దికోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను అవమానిస్తారా ? కరప్షన్ కి కజిన్ బ్రదర్ జగన్, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ అండ్ కో చేయని అక్రమాలు లేవు. తవ్వే కొద్దీ జగన్ పిఏ వేల కోట్ల అక్రమాలు, అవినీతి సంపాదన వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్లు పాలన గాలికొదిలి దోచుకోవడం,దాచుకోవడమే పనిగా గొడ్డలి పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.