ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌లో భాగంగా కందుకూరు సీఐ గారు, కందుకూరు టౌన్ ఎస్సై గారు కలిసి కందుకూరు పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణ శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాలు, అనుమానాస్పద కదలికలు జరిగే ప్రదేశాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న Sky Eye Prakasam పర్యవేక్షణ ద్వారా నేరాల నివారణ, శాంతిభద్రతల పటిష్టత మరియు ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు.డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి, తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు.ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి ‘Sky Eye Prakasam’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *