పకృతిని ప్రేమించి పర్యావరణాన్ని రక్షిస్తే అది మనకు వంద రెట్లు మేలు చేస్తుందని కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో మండల్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణ ప్రేమికులుగా మారి పకృతిని రక్షించాలని అప్పుడు మన మానవాళితోపాటు జీవరాశులు అన్నిటికీ పకృతి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కొత్తూరు హరికోటేశ్వరరావు, బట్టరశెట్టి సాయి శంకర్, షేక్ జమీర్, పండిత్ సంపత్ కుమార్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *