భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు మహోత్సవ వేడుకల నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ‘Sky Eye Prakasam’ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు తెట్టు దర్గా గంధ మహోత్సవం ప్రాంగణంలో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాల ద్వారా మహోత్సవ ప్రాంగణం, భక్తుల రద్దీ, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు మరియు సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తుల కదలికలను పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు మరియు అత్యవసర పరిస్థితులపై నిరంతర నిఘా కొనసాగించారు.Sky Eye Prakasam ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహోత్సవం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పరిస్థితులను రియల్ టైమ్‌లో పరిశీలించి అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోందని అధికారులు తెలిపారు.మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహిస్తున్న తెట్టు దర్గా గంధ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక బందోబస్తు మరియు నిఘా చర్యలు చేపట్టారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *